Breaking

2, డిసెంబర్ 2022, శుక్రవారం

నాంజింగ్ స్థూపం ( చైనా ) : తూర్పు చైనా లో నిర్మించిన అద్భుత స్థూపం ఇది...260 అడుగుల ఎత్తు....184 మెట్లు ఎక్కాలి...?


నాంజింగ్ స్థూపం ( చైనా ) 

తూర్పు చైనా లో నిర్మించిన అద్భుత స్థూపం ఇది...260 అడుగుల ఎత్తు....184 మెట్లు ఎక్కాలి... 

స్వచ్ఛమైన తెల్లటి " పింగాణీ "ఇటుకలతో దీనిని నిర్మించారు . 

తూర్పు చైనా లోని " చాంగ్ నాదీ " తీరం లో నిర్మించిన అద్భుత స్థూపం ఇది . ఇప్పుడు అస్తిత్వం లో లేని ఈ స్థూపాన్ని చిత్రాల్లో చూసి ఆనందించాల్సిందే . 1853 లో " థైరీంగ్ " తిరుగుబాటు దారు లు దాడి చేసి ఆ స్థూపాన్ని నెల మట్టం చేశారు . 

* చాంగ్ నాదీ " తీరం లో నిర్మించారు 

* 260 అడుగుల ఎత్తు - 1413 లలో నిర్మాణం 

* 1853 లో " థైరీంగ్ " తిరుగుబాటు

నాన్జింగ్ సిటీ వాల్ 13 మైళ్లు మరియు 67 అడుగుల ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఈ పురాతన నగర గోడ 600 సంవత్సరాల కంటే పాత మింగ్ రాజవంశం యొక్క అవశేషం. చక్రవర్తి ఝు యువాన్‌జాంగ్ క్రీ.శ. 1366లో నాన్‌జింగ్ రక్షణను పెంచే సాధనంగా గోడ నిర్మాణానికి అధికారం ఇచ్చాడు.

గోడ నాలుగు విభాగాలలో నిర్మించబడింది: ఔటర్ సిటీ, ఇన్నర్ సిటీ, ఇంపీరియల్ సిటీ మరియు ప్యాలెస్ సిటీ (దీనిని 'ఫర్బిడెన్ సిటీ' అని కూడా పిలుస్తారు). నేటి ప్రధాన శిధిలాలు ఇన్నర్ సిటీ గోడ నుండి ఉన్నాయి. గోడ నిర్మాణంలో దాదాపు 350 మిలియన్ ఇటుకలను ఉపయోగించారు, ప్రతి దాని నాణ్యతకు బాధ్యత వహించే వ్యక్తి పేరును చెక్కారు - సందర్శకులు చైనీస్ భాషను అందమైన కాలిగ్రఫీ ద్వారా ఆనందించవచ్చు.

7 Places to Visit in Nanjing, China - Travel + Design


చైనా చక్రవర్తి " యాంగ్లో " తన తల్లి స్మారక చిహ్నం గా ఈ స్థూపాన్ని నిర్మించారు . 1413 లలో నిర్మాణం ప్రారంభంమై రెండు దశాబ్దాలకు పూర్తయినది . చైనీయాలు దీనిని కృతజ్ఞతా మందిరం గా పిలిచేవారు . 

Outbound]: Nanjing's Usnisa Palace | SmartShanghai


ఈ " పోర్సెలేన్ " స్థూపం ఒక దేవాలయం వంటిది . చైనాలో ఆలయాలను " పగోడా " అంటారు . 260 అడుగుల ఎత్తు ఉండటం వల్లనే దీనికి ప్రఖ్యాతి రాలేదు . స్వచ్ఛమైన తెల్లటి " పింగాణీ "ఇటుకలతో దీనిని నిర్మించారు . పగలు సూర్యకాంతిలో ధగధగలాడేది . రాత్రివేళ 140 లాంతర్లతో కాంతిలో తళ తళలాడేది . స్థూపం లో తొమ్మిది అంతస్తులు ఉండేవి . లోపలి భాగంలో అమర్చిన రంగు రంగుల టైల్స్ పై జంతువుల చెట్టు చేమలు బొమ్మలు కనువిందు చేసేవి . 


La pagoda: alle origini dell'architettura in legno


ఈ స్తూపం పైభాగం లో బంగారపు సిఖరం ఉండేది . దానిమీద ఉన్న అయిదు పెద్ద ముత్యాలు  నాంజింగ్ నగరాన్ని అగ్ని , వరదలు , ఈదురుగాలులు , శత్రువులు నుంచి రక్షించేవని విశ్వసించేవారు . స్థూపం శిఖరానికి చేరుకోవడానికి 184 మెట్లు ఎక్కాలి . అన్ని అంతస్థుల మీద అమర్చిన 152 బుల్లి గంటలు గాలి వీచినప్పుడల్లా మృదు మధురంగా ఆహ్లాదభరితంగా మొగేవి . 



**********ఇలాంటి ఆసిక్తికరమైన విషియాల కోసం ఫాలో చేయండి ఫ్రెండ్స్ *****************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Adbox