డాలర్ అంతు చూస్తే .....ఇక అమెరికా ఔట్.. డాలర్ బదులు రూపాయి వాణిజ్యం .. !!!
ప్రపంచ దేశాల డాలర్ ఆదిన్యత తగ్గిపోవడం.
2030 తరువాత అమెరికా పరిస్థితి ... ఈ ఘనత ట్రంప్ కె సొంతం !!!
ప్రపంచ దేశాల్లో ఏ దేశ కరెన్సీ ఆ దేశానికి ఉంటుంది .కానీ ప్రపంచ దేశ దేశాలలో ఎక్కువగా వాడుకుగా ఉండి ,చెలామణి లో ఉన్నదీ "డాలర్". ఇప్పుడు ప్రతి ఒక్క దేశం వేదేశాల మారకద్రవ్యాన్ని మొత్తం డాలర్ ల రూపంలోనే ఉంచుకుంటున్నాయి . ప్రతి దేశం తన దగ్గర ఇన్ని డాలర్లు ఉన్నాయి అని చెప్పుకుంటుంటుంది . దీని వాళ్ళ అమెరికా తన దగ్గర ఉన్న డాలర్స్ ని ముద్రించి ప్రపంచ దేశాల దేశాలమీదకు పంపిణి చేస్తుంది(వదిలేస్తుంది) . ఈ కారణం వాళ్ళ ఎక్కువగా అమెరికా డెవలప్ అవుతూ... లాభ పడుతుంది అని చెప్పవచ్చు .
ఇప్పుడు ఆ అమెరికా సంగతి చూడాల్సిన సమయం వచ్చింది , అన్ని దేశాలు కలిసి డాలర్ ని వదిలించుకునే ప్రయత్నం చేస్తే చాలు మొత్తం అమెరికా యొక్క ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలి పోవడానికి కారణం అవ్వొచ్చు ,అంతే కాకుండా డాలర్ విలువ కూడా లేకుండా పోతుంది .
ప్రపంచ రిజర్వు కరెన్సీ డాలర్ :
ప్రపంచ రిజర్వు కరెన్సీ డాలర్ ఉంది ప్రపంచ దేశాలలో విదేశీ రిజర్వు లలో 58% శాతం డాలర్ ,అంతర్జాతీయ వాణిజ్యంలో 54% ఎగుమతులు అన్ని డాలర్ రూపం లో లావాదేవీలు జరుగుతున్నాయి . దీని వల్ల "ఎక్సార్బిటెంట్ ప్రివిలేజ్ " అనేది అమెరికా కి లభిస్తోంది .అంటే తక్కువ వడ్డీరేట్లు కి రుణాలు తీసుకోవడం ,ఆర్థిక ఆంక్షలు విధించే హక్కులు,బలం ఉండటం చేస్తుంది . అందుకే ఇప్పుడు నుంచి ఈ డాలర్ యొక్క బంధాల నుంచి బయట పడటానికి ప్రపంచ దేశాలు మొత్తం ప్రయత్నం చేస్తున్నాయి .
ప్రపంచ దేశాల డాలర్ అధీన్యత తగ్గిపోవడం . :
2025 సవంత్సరం నాటికి చూస్తే డాలర్ విలువలో గణనీయంగా తగ్గుదల కనిపిస్తుంది ,ముఖ్యంగా బ్రిక్స్ దేశాలు బ్రెజిల్ ,రష్యా ,భారత్ ,చైనా ,దక్షిణాఫ్రికా తమ వాణిజ్యాన్ని డాలర్స్ తో కాకుండా తమ దేశీయ కరెన్సీలలో నిర్వ్హయించాలని అనుకుంటున్నాయి . ఈ దిశగా భారత్ కూడా బ్రిక్స్ వాణిజ్యాన్ని రూపాయిలో కొనసాగుతుంది .
డాలర్ పై ఆధారపడే అమెరికా ఆర్ధిక వ్యవస్థ కు వచ్చే ప్రభావం :
ప్రపంచ దేశాలు డాలర్ ధ్వారా లవ దేవీలు సంఖ్యను తగ్గిస్తే , అమెరికా ఆర్ధిక వ్యవస్థకు తీవ్రమైన నష్టాలు తప్పవు . 2025 లో ట్రంప్ పాలసీలు కారణంగా అమెరికా ఆర్ధిక వృద్ధి మందగించి ,విదేశీ పెట్టుబడులు తగ్గాయని,డాలర్ విలువ 10. 8% గా పడిపోయింది అని చెప్పబడింది . ఇది 1973 తరువాత అత్యల్ప స్థాయి .
గమనార్హమైన భవిష్యత్తు దృశ్యం :
ఇప్పిడు జరిగిన ఈ మార్పులు వలన 2030 తరువాత అమెరికా ఆర్థిక స్థితిగతులుపై అనిశ్చిత గలదు . డాలర్ ప్రపంచ కరెన్సీగా తన గౌరవాన్ని కొంతమేరకు కోల్పోవచ్చు . ఇది దశలవారీగా అమెరికా ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నంగా మారుతుందు .
ఈ సమాచారం ప్రకారం , ప్రపంచ దేశాలు ఒప్పుకున్నప్పటికీ డాలర్ ఆధీన్యత ద్వారానే ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ నడుస్తుందని , కాని ఇప్పుడు ప్రతి దేశం డాలర్ కంటే స్వంత కరెన్సీలను ప్రోత్సహించాలని చూస్తున్నారని , దీని వలన అమెరికా ఆర్ధిక వ్యవస్థ పై తీవ్రమైన ప్రత్యాశలు ఉన్నాయని చెప్పవచ్చు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి