Breaking

30, అక్టోబర్ 2022, ఆదివారం

మంత్రసాని "నరసమ్మ" గారు , ఈమె తన జీవిత కాలంలో 15,000 పైగా ప్రసవాలు చేసింది.డాక్టర్లు సైతం ఈవిడకు అభిమానులుగా ఉన్నారు......

మంత్రసాని "నరసమ్మ" గారు

మంత్రసాని "నరసమ్మ" గారు , ఈమె తన జీవిత కాలంలో 15,000 పైగా ప్రసవాలు చేసింది.డాక్టర్లు సైతం ఈవిడకు అభిమానులుగా ఉన్నారు......

ఆమె నిస్వార్థ సేవలను గుర్తించి గౌరవ "డాక్టరేట్" ప్రదానం చేసింది...

97 సవంత్సరాల వయస్సు ఉన్న ఈమె కర్ణాటక రాష్ట్రం వెనుకబడిన కొండ ప్రాంతాలలో ఎటువంటి వైద్య సదుపాయాలు లేని , కనీసం రోడ్ సదుపాయాలు కూడా లేని తండాలలో ప్రకృతి వైద్యం చేస్తుంది .ఒక 50 సవత్సరాలు క్రితం చాలా మంది మన దగ్గరా ఇలా పుట్టినవారే కదా......

*   ఈమె అసలు పేరు "సులగిట్టి నర్సమ్మ" (97). 
*   సులగిట్టి నర్సమ్మ (1920 - డిసెంబర్ 25, 2018) 
*   ఈమె కర్ణాటక రాష్ట్రానికి చెందిన సామాజిక కార్యకర్త, మంత్రసాని. 
*   ఈమె పద్మశ్రీ పురస్కార గ్రహీత.

        ముఖ్యంగా గర్భవతులుకు సుఖప్రసవం చేయించడంలో ఈవిడ దిట్ట . ఆధునిక స్కానింగ్ సైతం గుర్తించలేని  కొన్ని గర్భస్త శిశువు లక్షణాలను ఈవిడ తన ప్రక్రృతి వైద్య విధానం ద్వారా ఖచ్చితంగా గుర్తించగలదు. గైనకాలజిస్టులు, రేడియాలజిస్టులు సైతం ఈవిడ ప్రతిభకు అబ్బురపడుతారు.,
బెంగుళూరులోని అనేక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లలో డాక్టర్లు సైతం ఈవిడకు అభిమానులుగా ఉన్నారు....

    ఒకవేళ సిజేరియన్ తప్పనిసరి అయితే ముందే హెచ్చరించి తగిన సూచనలు చేసి సమీప ఆసుపత్రికి ముందే చేరేలా చేసి ప్రమాదాన్ని నివారిస్తుంది. "సూలగుత్తి "అంటే కన్నడ భాషలో "ప్రసవాలు చేసే దాది" లేదా "మంత్రసాని" అని అర్ధం .
                   ఈమె నిరుపేద కుటుంబంలో జన్మించింది. ఈమె తన జీవిత కాలంలో "15,000" పైగా ప్రసవాలు చేసింది.,తను ఎటువంటి డబ్బులూ తీసుకోదు..., ఎవరైనా తనకు డబ్బులు గాని, బహుమతులు గానీ తన ఇంటికి పంపిస్తే వాటిని ఆవిడ స్వయంగా పంపించినవారి ఇంటికి వచ్చి ఇచ్చిపోతుంది...., ఆమె రోజువారీ వ్యవసాయ కూలీగా బ్రతుకుతున్నారు. "తుమకూరు యూనివర్సిటీ "ఆమె నిస్వార్థ సేవలను గుర్తించి గౌరవ "డాక్టరేట్" ప్రదానం చేసింది...

మంత్రసాని సేవలను అందించడంలో ఆమె చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆమె దయ సమాజంలోని పేద వర్గాలకు ఆమెను ప్రేమిస్తుంది. నా ఆలోచనలు ఆమె కుటుంబంతో పాటు చాలా మంది అభిమానులతో ఉన్నాయి’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. సీఎం హెచ్‌డీ కుమారస్వామి, మాజీ సీఎం బీఎస్‌ యడ్యూరప్ప కూడా నరసమ్మ మృతికి సంతాపం తెలిపారు.  



అనుభవాన్ని మించిన పాఠం లేదు .... చదువులు , డిగ్రీలు మార్గాన్ని నిర్ధేశిస్తాయి . ప్రతి అడుగులో పాటలు నేర్చుకుంటూ వెళితే ఉన్నత శిఖరాలు అందుకుంటారు .
    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Adbox