ఆర్గానిక్ కార్లు - (Organic Cars)
ఆర్గానిక్ కార్లు ! (Organic Cars) బ్రిటన్, భారత్ లలో ఈ కార్లనే వాడుతున్నారు.మొట్టమొదటి సారిగా ఆటోమొబైల్ షోలో ప్రదర్శించారు. ఇప్పుడీవే ప్రపంచంలో హాట్ టాపిక్.
బ్రిటన్, భారత్ లలో ఒకరిద్దరు వ్యక్తులు "చెక్కకార్లనే" .....ఇవ్వన్నీ"సెల్యూలోజ్ నానో ఫైబర్"తో చేసిన కార్లే.....ఇప్పుడీవే ప్రపంచంలో హాట్ టాపిక్.
◆ ప్రపంచంలో పర్యావరణ స్పృహ పెరుగుతోంది. ఆయుష్షును, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు రసాయనాలు ,ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి సేంద్రియ బాట పడుతున్నారు. పండ్లు,కూరగాయలు, ధాన్యాలు సరేసరి, ఇప్పుడు కార్ల వంతు వచ్చింది. ఈ మధ్య జపాన్ లో భారీ స్థాయిలో ఆటోమొబైల్ షో జరిగింది. అందులో అనేక ఆర్గానిక్ కార్లను ప్రదర్శించారు. ◆ కార్ల బాడీలను స్టీలు లేదా అల్యూమినియంలతో తయారు చేస్తారు.ఆ రెండింటికీ ప్రత్యామ్నాయాలు వెతికే పని మొదలుపెట్టారు ఆటోమొబైల్ రంగ అతిరధులు. అందులో భాగంగా జర్మనీకి చెందిన ఓ కార్ల కంపెనీ వారు "డ్యూరోప్లాస్టిక్" కార్ల బాడీలను తయారుచేశారు. పర్యావరణహితం కాకపోయినా అసక్తిని మాత్రం పెంచిందీ ప్రయోగం.
◆ ఆకర్షణీయమైన "లేదర్ "తో కూడా కార్ల బాడీలను కప్పి కొత్తదనానికి తెరతీసింది ఓ "జెకోస్లోవేకియా" ఆటోమొబైల్ సంస్థ. అందులోనూ ఆర్గానిక్ లెదర్ కూడా కావడంతో వీగన్లు.శాకాహారులు మద్దతు తెలిపారు. కానీ బయట లెదర్ తొడుగు మాత్రమే ఉండటం, లోపల స్టీలు, అల్యూమినియం వాడటంతో సేంద్రియవాదులను ఈ కారు పెద్దగా ఆకర్షించలేదు.
◆ ఆర్గనిక్ కార్ల ఉత్పత్తి లో భాగంగా కొన్నాళ్ళు క్రితమే చెక్క కార్లను తయారు చేశారు. కాన్సెప్ట్ పెద్దగా హిట్ కొట్టలేదు. దీంతో మరుగున పడింది. కానీ ఇప్పటికీ బ్రిటన్, భారత్ లలో ఒకరిద్దరు వ్యక్తులు "చెక్కకార్లనే" వాడుతున్నారు.
...ఇవ్వన్నీ"సెల్యూలోజ్ నానో ఫైబర్"తో చేసిన కార్లు. వ్యవసాయ వ్యర్ధాలు, ఇతర సేంద్రియ ఉత్పత్తి లను ఉపయోగించి రూపొందించిన కొత్తరకం పదార్ధమే సెల్యూలోజ్ నానో ఫైబర్.
చాలా దృడంగా ఉండే ఈ పదార్ధంతో కార్ల బాడీలను తయారు చేశారు. మొట్టమొదటి సారిగా ఆటోమొబైల్ షోలో ప్రదర్శించారు. ఇప్పుడీవే ప్రపంచంలో హాట్ టాపిక్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి