ప్లయింగ్ సీక్రెట్స్-విమాన ప్రయాణం క్షేమమేనా
Flying Secrets : విమాన ప్రయాణం క్షేమమేనా..! అనుకోని పరిస్థితిలో కిటికీ అద్దాలు పగిలిపోతే..,టైర్లు పేలిపోతే..,ఆక్సిజన్ ఆగిపోతే...ఇలాంటి మీ ఎన్నో అనుమానాలికి..సమాధానాలు.
విమాన ప్రయాణం క్షేమమేనా..? అనుకోని పరిస్థితుల్లో కిటికీ అద్దాలు పగిలిపోతే ,టైర్లు పేలిపోతే ఎలా....? అప్పుడప్పుడు ఇలాంటి ప్రశ్నలు మనకు వస్తుంటాయి, అంతేకాకుండా పిల్లలు కూడా అడుగుతుంటారు. అందుకే మనం వివరంగా తెలుసుకుందాం. తెలియని వారికి తెలియచేదాం.
పదునైన లోహపు వస్తువులు, కత్తులు, నెయిల్ కట్టర్లు విమానంలో తీసుకెళ్లనీయరు. ఇక, విమానం కిటికీలను పాలీ కార్బోనేట్ తో తయారుచేస్తారు. బలమైన మనిషి పిడికిలితో బాదినా అది పగలదు. అంతేకాదు, విమానం గాల్లో అంత వేగంగా వెళుతున్న ప్పుడు పడే ఒత్తిడినీ, గాలీ వానా ఎండలనూ తట్టుకునే శక్తి కిటికీ అద్దాలకు ఉంటుంది. అవీ మూడుపొరలుగా ఉంటాయి. కాబట్టి, భయపడాల్సిన పనే లేదు.
ముప్పయివేల అడుగుల ఎత్తులో ఎగురు తున్నప్పుడు... హఠాత్తుగా ఆక్సిజన్ ఆగిపోతే... ఆ విషియాన్ని సెన్సార్లు గుర్తిస్తాయి. వెంటనే సీటుపైన ఉన్న ఆక్సిజన్ మాస్క్ లు తెరుచుకుంటాయి. వాటిని నోటికి అమర్చుకోగానే,రసాయన చర్య జరిగిపోయి...ఆక్సిజన్ సరఫరా మొదలవుతుంది. అలా ఇరవై ముప్పయి నిమిషాల పాటు ప్రాణవాయువు అందుతుంది. అంతలోపు విమానం కిందకి వచ్చేస్తుంది.20 వేల అడుగుల కిందకి విమానం రాగానే ,ఇక ఆక్సిజన్ సమస్య ఉండదు.ఇంజన్ నుంచి గాలిని తీసుకుని.. లోపలకి పంపిస్తుంది. ఇక మాస్క్ లు తీసేయవచ్చు. అవసరమైతే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తారు.
కార్లు ,బైకులకు పార్కింగ్ ఉన్నట్టే విమానాలకూ ఉంటుందా..!అంటే..ఉంటుంది. ఎయిర్ పోర్ట్ లలో రెండు రకాలు...ఒకటి ప్రైమరీ, రెండు సెకండరీ. మనకు శంషాబాద్, బేగంపేటల్లా అన్నమాట. ప్రైమరీలో పార్కింగ్ ఫీజులు అధికం. ఎందుకంటే విమానాలు రాకపోకల రద్దీ ఎక్కువ అక్కడ. విమానం లాంజ్ దగ్గరకు వచ్చి , ఎయిర్ బ్రిడ్జ్ ధ్వారా ప్రయాణికులను నేరుగా విమానంలోకి ఎక్కుచుకోవాలి అంటే, పార్కింగ్ ఫీజు ఎక్కువగా చెల్లించాలి. అదే విమానాన్ని దూరంగా పార్క్ చేసి...బస్సులో ప్రయాణికుల్ని విమానం వరకూ తీసుకెళ్లగలిగితే... తక్కువ రుసుముతో సరిపెట్టుకోవచ్చు. అందుకనే ప్రైవేట్ గగనయాన సంస్థలన్నీ సొంత బస్సుల్ని ఏర్పాటు చేసుకుంటాయి.
మిగిలిన రవాణా సాధనాలతో పోలిస్తే, విమానాలే సురక్షితం,ప్రమాదాలకు ఆస్కారం చాలా తక్కువ. ఒక అధ్యయనం ప్రకారం.. రోడ్ మార్గంలో 140 ప్రయాణాలకు ఓ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అదే ,గగణతలంలో...5 లక్షల విమాన ప్రయాణాలకు ఒకసారి మాత్రమే ప్రమాదం పొంచి ఉంటుంది. ఆమాటకొస్తే అపార్టుమెంట్లు లిప్టు కంటే విమానమే సురక్షితం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి