Breaking

29, నవంబర్ 2022, మంగళవారం

Stone Henge Of England - స్టోన్ హేంజ్ ( వేలాడే రాళ్లు ) - బ్రిటన్ - ఈ రాళ్ళ ఎక్కడి నుంచి వచ్చాయి ? ఎవరు సృష్టించారు ?

Stone Henge Of England స్టోన్ హేంజ్ (వేలాడే రాళ్లు )

దక్షిణ ఇంగ్లాడులోని  " సాలిస్ బరి "  మైదానం లో కనిపించే   ఈ రాళ్ళ వరుస చూపరులను ఆశ్చర్యపరుస్తుంది .  

ఈ రాళ్ళ ఎక్కడి నుంచి వచ్చాయి  ?  ఎవరు సృష్టించారు ? ఎందుకు ? ఎప్పుడు ? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే .


(Despite extensive research and theorising, today we are really no closer to understanding how the stones of Stonehenge were put there and why.)

Stonehenge: The Mysterious Monument of the British Isles - Beyond the 7  Wonders of the World - YouTube

 
*    స్టోన్‌హెంజ్ బహుశా ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ చరిత్రపూర్వ స్మారక చిహ్నం. 

                     *   మొదటి స్మారక చిహ్నం ప్రారంభ హెంగే స్మారక చిహ్నం, ఇది సుమారు 5,000 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. 

*   నియోలిథిక్ కాలం చివరిలో 2500 BCలో నిర్మించబడింది.

పురావస్తు శాస్త్రవేత్తలు , ఇంజనీర్లు , చరిత్రకారులు , ఈ ప్రశ్నలకు సమాధానాలను అన్వేషించారు . కానీ ఫలితం లేకపోయింది. ఈ రాళ్ళూ సహజంగా అక్కడ ఏర్పడినవి కావన్నది మాత్రం నిజం. ఆదిమానవులు ఒక లక్ష్యం కోసం వీటిని అమర్చి వుంటారు . వీటి వెనుక మానవుడి తెలివి , వ్వూహం , ఓర్పు ఉన్నాయి . 



Stonehenge: The record-breaking site's mysterious history | Guinness World  Records

              స్టోన్ హేంజ్ అంటే ఆంగ్లో-శాక్సన్ అర్ధం 'వేలాడే రాళ్ళు '. క్రీ . పూ . 3100 ప్రాంతంలో వీటి అమరిక ప్రారంభమైంది . అతి పురాతన కట్టడాన్ని స్టోన్ హేంజ్-1 అని, క్రీ . పూ . 2100 ప్రాంతంలో అమర్చిన దానిని స్టోన్ హేంజ్-2 గాను వ్యవహరిస్తున్నారు . 


Could Stonehenge be a pre-historic 'castle' or a fort? - Quora

నాలుగు టన్నుల బరువుండే రాతి స్తంభాలను నిలబెట్టారు . ఏదో లక్ష్యం కోసం వీటిని అమర్చారు గాని కట్టడం పూర్తి కాకుండానే కూలిపోయినట్టు కనిపిస్తోంది . 240 మైళ్ళ దూరంలోని నైరుతి వెల్స్ లోని ప్రెసేలీ కొండల నుంచి ఈ రాతి స్థంబాల ను తరలించి నట్లు 1923 లో కనుగొన్నారు . 


Pin on History of England

ఒక శతాబ్దం తర్వాత "స్టోన్ హెంఙ్ -3" ని నిర్మించారు . దానికి 20 కిలోమీటర్ల దూరం లోనే కొండరాళ్ళ లభ్యమైనాయి  అవి 30 అడుగుల పొడవుతో , 50 టన్నుల బరువుతో ఉండటం తో ఎంతో కష్టపడి రవాణా చేయవలసి వచ్చింది . గుర్రపు నాడ ఆకారం లో దీనిని ఎందుకు నిర్మించవలసి వంచిందో ఇప్పటికీ మిస్టరీ . క్రీ . ప్రూ . 1100 సవంత్సరం వరకు ఇవి ఉపయోగం లో ఉన్నట్లు తెలుస్తుంది . 


Stonehenge's Secret - Discovering How & Why It Was Built


వీటిని రోమన్లు నిర్మించారన్నా ఒక అభిప్రాయం ఉంది కానీ రోమన్లు ఈ ప్రాంతానికి రావడానికి ముందే ఇవి నిర్మితమయ్యాయి . కాలాన్ని లెక్కించడానికి , భగవంతుణ్ణి ప్రార్ధించడానికి వీటిని నిర్మించినట్లు అనేక మంది సిద్ధాంతీకరించారు . 



Western England: Harry Potter, Stonehenge, Bath, and the Cotswolds —  EatWanderExplore & FIRE


కాలం , మనుషులు వీటిని శిథిలం చేసిన పర్యాటకులు వీటిని చూడటానికి తండోప తండాలుగా వస్తుంటారు . ముఖ్యంగా వేసవిలో ఇక్కడి హీల్ స్టోన్ పై నుంచి సూర్యోదయాన్ని చూడటం ఒక మధురానుభూతి 


* ఈ సముదాయం కనీసం 3000 సంవత్సరాల పాటు అనేక నిర్మాణ దశల్లో నిర్మించబడింది, అయితే 6500 సంవత్సరాలకు పైగా విస్తరించి ఉండవచ్చు.



1 కామెంట్‌:

Adbox