Breaking

17, డిసెంబర్ 2022, శనివారం

RRB Group D Result 2022: ఎట్టకేలకు ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌-డి రాత పరీక్ష ఫలితాల తేదీ విడుదల.. ‘లక్షకుపైగా రైల్వే జాబ్స్‌’

RRB Group D Result 2022: ఎట్టకేలకు ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌-డి రాత పరీక్ష ఫలితాల తేదీ విడుదల.. ‘లక్షకుపైగా రైల్వే జాబ్స్‌’

ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌-డి 2019లో (నాలుగేళ్ల క్రితం) 1,03,769 పోస్టులకు నియామకాలకు ఆగస్టు 17 నుంచి అక్టోబర్‌ 11 వరకు ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌ను దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు..

ఇతర సమాచారం ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చని అభ్యర్ధులకు రైల్వే శాఖ సూచించింది.

భారతదేశంలో RRB గ్రూప్ D ఉద్యోగాల కోసం అర్హత ప్రమాణాలు మరియు నియమాలు క్రింది విధంగా ఉన్నాయి:


 RRB Group D 2019లో (నాలుగేళ్ల క్రితం) 1,03,769 పోస్టులకు నియామకాలకు ఆగస్టు 17 నుంచి అక్టోబర్‌ 11 వరకు ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌ను దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సుమారు కోటి మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గత అక్టోబర్‌లో ఈ పరీక్ష ప్రాథమిక ఆన్సర్‌ కీ విడుదలైంది.


ఈ క్రమంలో ఫైనల్ ఫలితాల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారికి కేంద్రం శుభవార్త తెల్పింది. ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌-డి పరీక్ష ఫలితాలు డిసెంబర్‌ 24న విడుదల చేయనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ బుధవారం వెల్లడించింది. ఈ మేరకు డిసెంబర్ 14న విడుదల చేసిన ప్రకటనలో ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నవారు డిసెంబర్‌ 24, అంతకు ముందే ప్రకటించే వీలుందని తెల్పింది. రాత పరీక్ష ఫలితాలతో పాటు, ఫైనల్‌ ఆన్సర్‌ కీని కూడా విడుదల చేయనున్నట్లు పేర్కొంది.

రాత పరీక్షలో మెరిట్‌ సాధించినవారు వచ్చే ఏడాది (2023) జనవరిలో నిర్వహించే ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టుకు హాజరుకావల్సి ఉంటుంది. ఆ తర్వాత మెడికల్ టెస్టులు, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఉంటుంది. ఇలా మూడు దశల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే ఆయా పోస్టులకు ఎంపిక అవుతారు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టుకు సంబంధించిన తేదీలు త్వరలో వెల్లడించనున్నట్లు రైల్వేశాఖ పేర్కొంది. ఇతర సమాచారం ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చని అభ్యర్ధులకు రైల్వే శాఖ సూచించింది.

Results


                                                             <:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::>

RRB గ్రూప్ D ఉద్యోగాలు భారతీయ రైల్వేలలోని వివిధ స్థానాలను సూచిస్తాయి, వీటిలో ట్రాక్ మెయింటెయినర్ గ్రేడ్ IV, హెల్పర్/అసిస్టెంట్, పాయింట్స్‌మన్, గేట్‌మ్యాన్, పోర్టర్ మొదలైనవి ఉన్నాయి. ఈ ఉద్యోగాల కోసం రిక్రూట్‌మెంట్‌ను భారతదేశంలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) నిర్వహిస్తుంది.

భారతదేశంలో RRB గ్రూప్ D ఉద్యోగాల కోసం అర్హత ప్రమాణాలు మరియు నియమాలు క్రింది విధంగా ఉన్నాయి:

విద్యార్హత: అభ్యర్థి NCVT/SCVT లేదా తత్సమానం ద్వారా గుర్తింపు పొందిన సంస్థల నుండి 10వ తరగతి లేదా ITI ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థికి కనీస వయోపరిమితి 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయోపరిమితి 33 సంవత్సరాలు. అయితే, SC/ST/OBC/PwD వంటి రిజర్వేషన్ వర్గాలకు చెందిన అభ్యర్థులకు వయో సడలింపులు ఉన్నాయి.
పౌరసత్వం: అభ్యర్థి భారతీయ పౌరుడై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: RRB గ్రూప్ D ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి.
పే స్కేల్: RRB గ్రూప్ D ఉద్యోగాలకు పే స్కేల్ స్థానం మరియు స్థాయిని బట్టి మారుతుంది. అయితే, లెవల్ 1 స్థానాలకు బేసిక్ పే రూ. నెలకు 18,000.
దరఖాస్తు ప్రక్రియ: RRB గ్రూప్ D ఉద్యోగాల కోసం దరఖాస్తు ప్రక్రియ RRB యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో జరుగుతుంది. అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోవాలి మరియు అవసరమైన అన్ని వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి మరియు దరఖాస్తు రుసుము చెల్లించాలి.
మొత్తంమీద, RRB గ్రూప్ D ఉద్యోగాలు భారతీయ రైల్వేలలో పని చేయాలనుకునే మరియు దేశానికి సేవ చేయాలనుకునే అభ్యర్థులకు గొప్ప అవకాశాన్ని అందిస్తాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Adbox