ది గ్రేట్ వాల్ - చైనా -(The Great Wall Of China)
గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అనేది రాయి, ఇటుక, ట్యాంప్డ్ ఎర్త్, కలప మరియు ఇతర పదార్థాలతో చేసిన కోటల శ్రేణి, సాధారణంగా వివిధ సంచార సమూహాల చొరబాట్ల నుండి రక్షించడానికి చైనా యొక్క చారిత్రక ఉత్తర సరిహద్దుల మీదుగా తూర్పు నుండి పడమర రేఖ వెంట నిర్మించబడింది. .
గోడ నిర్మాణం 7వ శతాబ్దం BCలో ప్రారంభమైంది, అయితే ప్రస్తుతం ఉన్న చాలా గోడలు మింగ్ రాజవంశం (1368-1644) కాలంలో నిర్మించబడ్డాయి.
భూమి పైన అత్యంత పొడవైన మానవ నిర్మిత కట్టడం గ్రేట్ వాల్ అఫ్ చైనా , చంద్రగ్రహం ఫై నుంచి చూసిన ఇది కన్పిస్తుంది అని చైనీయాలు నమ్మేవారు . అంతరిక్ష నుంచి దీనిని చూడలేమని నాసా ఇటీవల స్పష్టం చేసింది .గ్రేట్ వాల్ తూర్పు నుంచి పశ్చిమానికి 1678 మైళ్ళ పొడువునా విస్తరించింది. కొన్ని చోట్ల రెండు ,మూడు ,నాలుగు ,అంచెలుగా ఈ గోడ నిర్మాణం జరిగింది . వీటిని కూడా పరిగణ లోకి తీసుకుంటే గోడ పొడవు 6,214 మైళ్ళు .
అంటే ఇది భూమి చుట్టు కొలతలో అయిదవ వంతు కంటే ఎక్కువ . ఉమ్మడి చైనా ను పరిపాలించిన తొలి చక్రవర్తి " షి హువాంగ్డి " 22 శతాబ్దాల క్రితమే గ్రేట్ వాల్ నిర్మాణానికి పథకం రచించారు .శత్రువులు , ఆక్రమణదారులు చొరబడకుండా చూడటమే గ్రేట్ వాల్ లక్ష్యం . గోడ పొడువునా నిలబడి ఉండే సైనికులు చొరబాటు హారులు వస్తున్నప్పుడు పగలైతే పోగలతో ,రాత్రి అయితే మంటలతో సిగ్నల్స్ తో ఇస్తారు .
ఈ మహా ప్రాకార నిర్మాణానికి కొన్ని లక్షల మంది కూలీలు శ్రమించారు . ఆ రోజుల్లో అనాగరక సంచార జాతులు వారు చైనా కు ప్రధాన శత్రువులుగా ఉండేవారు. వారిని బంధించి గ్రేట్ వాల్ నిర్మాణానికి ఉపయోగించుకున్నారు . గ్రామాల్లో పనీపాటా లేకుండా తిరిగేవారిని కూడా ఈ పనిలోకి తరిలించారు .గోడ పొడువునా నిలబడి ఉండే సైనికులు ఇటు శత్రువుల రాకను కనిపెడుతూ ఉండాలి .అటు కూలీలపై అజామహిషి వహించాలి . 1368 నుండి 1644 వరకు " మింగ్ "వంశపాలనలో గ్రేట్ వాల్ ను పునర్ నిర్మించారు .అప్పటి నుంచి ఇప్పటి వరకు గోడ అదే ఆకారం లో ఉంది .
గ్రేట్ వాల్ కింద భాగం లో 19 అడుగుల వెడల్పు ,పై భాగం లో 15 అడుగుల వెడల్పు ఉంది . ఎత్తు దాదాపు 30 అడుగులు . మధ్య మధ్య లో గెస్ట్ హౌస్ లు ఉన్నాయి . 230 అడుగుల ఎతైన వాచ్ టవర్స్ పై నిలబడి సైనికులు కాపలా కాస్తుంటారు . ఉత్తరాది నుంచి వచ్చే శత్రువులు నుంచి ఈ గోడ చైనాను రక్షిస్తూ వచ్చింది .చైనీయలు శ్రమ శక్తికి నిదర్శనమైన గ్రేట్ వాల్ చైనా సంస్కృతికి చిహ్నంగా నిలిచింది .
నేడు, గ్రేట్ వాల్ ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ, సందర్శకులు అన్వేషించడానికి గోడ యొక్క విభాగాలు తెరవబడి ఉన్నాయి. అయితే, గోడలోని చాలా భాగాలు శిథిలావస్థలో ఉన్నాయి మరియు ఈ చారిత్రాత్మక మైలురాయిని సంరక్షించడానికి మరియు పునరుద్ధరించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి