ఆకాశంలో మెరుపులు ఎందుకు వస్తాయి .?
వర్షాల కారణంగా వచ్చే వరదలతో పాటు పిడుగుపాటుతో సైతం ఎక్కువ మరణాలు నమోదవుతున్నాయి.
ఈ నేపథ్యంలో అసలు ఈ సీజన్‌లో ఉరుములు, మెరుపులు ఎందుకు ఏర్పడతాయి, వాటి బారిన పడకుండా ఎలా కాపాడుకోవచ్చు? వంటి వివరాలు తెలుసుకుందాం.
సూర్యరశ్మి లేకపోతే భూమి మంచుగడ్డ లా మారి ఉండేది .సూర్య రశ్మి మేఘాలలో ఫిల్టర్ అయిన తరువాత భూమి మీద పడుతుంది . మన ఉపరితలం లో ప్రతి చదరపు గజం పైన ప్రతి రోజూ 1000 వాల్ట్స్ విద్యుత్తు దీపంతో సమాన మైన వేడి సూర్యడు నుంచి పడుతుంది . అందులో అతి స్వల్పభాగం మాత్రమే భూమి పైన పడుతుంది . కొన్ని ప్రాంతాలలో ఏడాది పొడువునా వేడి అధికంగా ఉంటుంది .తీవ్రమైన వేడి వల్ల గాలి మార్పు చెంది ఉరుములు , మెరుపులు వస్తుంటాయి . ఉష్ణ మండల ప్రాంతాలలో ఇవి ఎక్కువ.
భూమి మీద వాతావరణం ఎప్పుడూ మారుతూ ఉంటుంది .సూర్య రశ్మి వల్ల భూమి మీద గాలి వేడెక్కి నా , త్వరలో పరిసరాల వేడితో సమానం అయిపోతుంది . భూమి మీద వేడి ఎప్పటికప్పుడు పంపిణి అవుతూ వాతావరణాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది . కానీ మేఘాలు ఉండే ప్రాంతాలలో వేడి పంపిణి కాదు . దానికి కారణం భూగోళం ఒకే సమయం లో సగ భాగాన్ని మాత్రమే సూర్య రశ్మి తాకడమే .
మేఘాలలో గాలి , నీరు ఉంటాయి . బాగా వేడెక్కినప్పుడు అణువులు మధ్య ఘర్షణ జరిగి విద్యుత్ పుడుతుంది . పైన , కింద భాగాలలో పాజిటివ్ ,మధ్య భాగాలలో నెగటివ్ ఉంటాయి . వీటి మధ్య తేడా 10 కోట్ల వోల్టులు దాటినప్పుడు మెరుపులు సంభవిస్తాయి .
* సైన్స్ ప్రకారం, రుణావేశిత మేఘాలలోని ఎలక్ట్రాన్లు సమీపంలోని ధనావేశిత మేఘాలవైపు ఆకర్షితమవుతుంటాయి. అయితే, ధనావేశిత మేఘాలు చాలా ఎత్తుకు వెళ్లిపోయినప్పుడు దగ్గరలో మరే వస్తువు ఉన్నా అటువైపు ఎలక్ట్రాన్లు ప్రయాణిస్తాయి. ఆ క్రమంలోనే మేఘాల నుంచి ఎలక్ట్రాన్లు ఒక్కసారిగా విడుదలై విద్యుత్ క్షేత్రంగా మారి భూమి మీదకు దూసుకొస్తాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి