భూకంపాలను పాలును పసిగట్టే పురుగులు
భూకంపాలను పాలును పసిగట్టే పురుగులు ....! వీటితో తయారు చేసిన మూలికా తైలాన్ని ఏ విధంగా ఉపయోగిస్తారు.....??
బహుళజాతి సంస్థలు వల్ల ప్రమాదం ఏంటి...?
వర్షాకాలంలో పచ్చికబయళ్ళు లో కనిపించే రెడ్ మైట్ (పట్టుపురుగులు ) లో అనేక ఔషద గుణాలు ఉన్నాయి .దీని శాస్త్రీయ నామం" ట్రాంబిడియం ",ఉత్తరభారతదేశంలో దీనిని 'భగవాన్ కి బుధియా 'అంటారు .యాభై రకాల 'యునానీ 'ఔషధాలలో దీనిని ఉపయోగిస్తారు .ఈ పురుగునుంచి తయారు చేసిన ట్రాంబిడియం అనే హోమియో ఔషధం నీళ్ల విరోచనాలు కు పనిచేస్తుంది .వీటితో తయారు చేసిన మూలికా తైలాన్ని పక్షవాత చికిత్స కు ఉపయోగిస్తారు .వీటి నుంచి తయారు చేసిన టానిక్ ను బాలింతకు ఇస్తారు. ఏ విధంగా ఉపయోగిస్తారు.
చత్తీస్ గఢ్ లోని కొన్ని వందల గ్రామాల్లో వర్షాకాలంలో పట్టుపురుగులు కనువిందు చేస్తాయి .కిలో పట్టు పురుగులును అర్ధ రూపాయికో ,రూపాయికో కొనే దళారులు పెద్ద మార్కెట్లో అధిక ధరలకు అమ్ముకుంటారు .జాతియా మార్కెట్ లో కిలోకి కొన్నివేల రూపాయల ధర పలుకుతుందని గ్రామస్థులకి తెలియదు .
పట్టు పురుగులు గుడ్లు పెట్టె సమయంలో మాత్రమే భూమి ఉపరితలం పైకి వస్తాయి . ఈ పురుగు వాతావరణ మార్పులను తేలికగా పసిగట్టగలదు . సూర్య గ్రహణం సమయం లో ఇవి ప్రత్యేకంగా ప్రతిస్పందిస్తాయి . భూకంపాలు ను పసిగట్టడానికి ఈ పురుగులను ఉపయోగించే అవకాశాలు ను శాస్త్రవేత్త లు అన్వేషిస్తున్నారు . ఈ పట్టుపురుగుల ఔషధంతో బహుళజాతి సంస్థలు మార్కెట్లోకి రావడంతో వీటి మనుగడకు ముప్పు ఏర్పడింది. వల్ల ప్రమాదం ఏంటి .
క్లిక్ చేయండి వీడియో చూడండి .......
వ్యవసాయము మొదలు పెట్టుటకు,"ఆరుద్ర కార్తె" అనుకూలమైనది. ఈ కార్తెలో మాత్రమే కనబడేది ఆరుద్ర పురుగు. ఇది మొఖమల్ 'క్లాత్ ను చుట్టుకున్నట్లుగా ఉండి, ఎర్రగా బుర్రగా, బొద్దుగా ఉంటుంది. అందంగా ఉండే ఈ పురుగు పంటలకు ఎలాంటి హానీ చేయదు. ఏడాదికి ఒకసారి మాత్రమే ప్రత్యక్షమౌతుంది.
ఎంతో కాలానికి వచ్చిన, అరుదుగా వచ్చేఅతిథినీ, బంధువునీ పలకరిస్తారు ఇలాగ, "బొత్తిగా నల్ల పూసవైనావు! మీ కటాక్షం కలిగినప్పుడు మాత్రమే, ఇట్టే వచ్చి, అట్టే మాయమౌతావు, ఆరుద్ర పురుగుకు మల్లే."
తెలుగు నాట, ప్రాచుర్యములో ఉన్న జాతీయములు ఇవి. ("నల్ల పూసవు అయి పోవుట" అనే మాట, వాడుకలో ఉన్న జాతీయము.)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి