మీ ఫోన్ పోయిందా-అయితే ఈ జాగ్రత్తలు మీ కోసమే..!
అవసరాలను తీరుస్తున్న ఫోన్లు నిర్లక్ష్యం... అజాగ్రత్త వల్ల పొగుట్టుకోవడమే...
ఆ వెబ్సైట్ లో మీ మొబైల్ ను బ్లాక్ చేయడానికి రిక్వెస్ట్ పెట్టండి.
ఇప్పుడు అందరి చేతుల్లో సెల్ ఫోన్ కామన్ అయిపోయింది. ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్న వారు దాదాపు అన్ని అవసరాలకు వినియోగిస్తుంటారు. కేవలం ఫోన్ కాల్స్ కోసమే కాకుండా.... ఆర్ధిక లావాదేవిలతో పాటు ఇంటి నుంచే పనులు చేయించుకునే యాప్స్ లను వినియోగిస్తున్నారు . అంతటి అవసరాలను తీరుస్తున్న ఫోన్లు నిర్లక్ష్యం... అజాగ్రత్త వల్ల పొగుట్టుకోవడమే... ఎవరైనా దొంగలించడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. ధీంతో ఫోన్ లో కాల్ డేటాతో పాటు అందులోని యాప్ ల వల్ల జరగరాని నష్టం జరుగుతుంది ఏమో అని అందరికి ఆందోళన మొదలవుతుంది. అలాంటి ముప్పును తప్పించుకోవాలి అంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఉపశమనం పొందవచ్చు. ఈ ముఖ్యమైన జాగ్రత్తలు మీకోసమే..
సిమ్ కార్డ్ బ్లాక్ :
మీ మొబైల్ ఫోన్ ఎక్కడైన పడిపోయిన లేదా దొంగలించబడినా మొదటిగా కస్టమర్ కేర్ సిబ్బందికి ఫోన్ చేసి ..సిమ్ కార్డును బ్లాక్ చేయండి. ఆ తరువాత మొబైల్ పోయినట్లు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయండి. తద్వారా మీరు కొలాట్రల్ డ్యామేజ్ తగ్గించవచ్చు.
ఫోన్ బ్లాక్ :
మీ మొబైల్ ఫోన్ చోరీకి గురైన వెంటనే... "సీఈఐఆర్"(CEIR) (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రార్) వెబ్సైట్ ను సందర్శించండి . మీ మొబైల్ ఫోన్ కు సంబంధించిన వివరాలును ...అంటే కొనుగోలు చేసిన బిల్ కాపీ ,కంప్లైంట్ నెంబర్ లాంటివి నమోదు చేసి..ఆ వెబ్సైట్ లో మీ మొబైల్ ను బ్లాక్ చేయడానికి రిక్వెస్ట్ పెట్టండి.
ఫోన్ లోని డేటా డిలీట్ చేయండి :
ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్లోని వివరాలను ఓ గూగుల్ ఎకౌంట్ లో భద్రపరుచుకుంటారు. ఇక మీ మొబైల్ ఫోన్ దొంగలుంచబడిన వెంటనే... మీరు www.google. com/android/find లింక్ క్లిక్ చేయండి . ఆ లింక్ లోకి లాగిన్ కాగానే మీ ఫోన్ సమాచారం వచ్చేస్తుంది. ఇక అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ధ్వారా మీరు ఫోన్లోకి డేటా డిలీట్ చేయవచ్చు. అంతేకాకుండా మొబైల్ పోయిన లేదా దొంగిలించిన వెంటనే ఈ మూడు పనులు చేయడం వలన మీరు మీ మొబైల్ ఫోన్ దుర్వినియోగం కాకుండా కాపాడుకోవచ్చు.
పోలీసులకు ఫిర్యాదు చేయాలి
Note : పోలీసులకు ఫిర్యాదు చేయాలి
ఫోన్ చోరీకి గురైన విషయాన్ని పోలీసులకు తెలియచేసి ఫిర్యాదు నమోదు చేయడం చాలా ముఖ్యం.
ఫిర్యాదు కాపీని బ్యాంకుకు, ఇన్సూరెన్సు అధికారులకు లేదా ఇతర సంస్థలకు సమర్పించాల్సి ఉంటుంది.
ఒక్కొక్కసారి సెల్ ఫోన్‌తో పాటు మన గుర్తింపు పత్రాలను కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. కొత్త గుర్తింపు పత్రాలు వచ్చేవరకూ చేతిలో ఫిర్యాదు కాపీ ఉంచుకోవడం చాలా అవసరం.
"ఫిర్యాదు నమోదు చేయడం వల్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తారు" అని సిమోనీ చెప్పారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి