Breaking

12, అక్టోబర్ 2022, బుధవారం

Indian Army Dog Zoom - బుల్లెట్స్ దిగినా...ఉగ్రవాదులును వదలని ఆర్మీ డాగ్.....!

బుల్లెట్స్ దిగినా...ఉగ్రవాదులును వదలని ఆర్మీ డాగ్ !

జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో 'జూమ్' అనే ఆర్మీ శునకం తీవ్రంగా గాయపడింది...

శరీరంలో రెండు బుల్లెట్లు దిగినా ఏమాత్రం లెక్కచేయకుండా ఆ శునకం పోరాడింది....




మాత్రుదేశాన్ని రక్షించుకునే క్రమంలో ప్రాణాలు మీదకు వచ్చినా, వెనకడుగు వేయరు సైనికులు. వారి శిక్షణలో ఓ జాగిలం కూడా అదే తరహా నిబద్ధతను కనబరించింది. జమ్మూకాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లా తంగపావ ప్రాంతంలో ఇద్దరు లష్కరే తోయిబా తీవ్రవాదలు నక్కినట్లు సోమవారం విశ్వసానియా సమాచారం అందింది.

           
                 బాధ్యతా బలగాలు రంగం లోకి దిగాయి.ముష్కరులును గుర్తించే పనిని అధికారులు జూమ్ అనే జాగిలానికి అప్పగించారు. ధీంతో అధి ఉగ్రవాదులు ను గుర్తించి , వారిపై దాడిచేసింది. ఈ క్రమంలో రెండు తూటాలు శరీరంలో నుండి దూసికెళ్లినా అది పోరాటాన్ని ఆపలేదు. 
        
ఇంతలో భద్రతా దళాలు అక్కడకు చేరుకుని ,ఉగ్రవాదులును హతమార్చారు. ఉగ్రవాదులు ను గుర్తించి ,మట్టుపెట్టడంలో జూమ్ కి కఠిన శిక్షణ ఇచ్చామని ,ఇంతకుముందు కూడా చాలా ఆపరేషన్ లో ఎంతో నిబద్ధతతో వ్యహరించింది అని అధికారులు తెలిపారు. గాయపడిన జాగిలాన్ని ఆర్మీ ఆసుపత్రికి తరలించి , చికిత్స అందిస్తున్నారు.

click link


చికిత్స:

ఆ తర్వాత అధికారులు 'జూమ్'ను  హుటాహుటిన ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కుక్క ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ 'జూమ్' శిక్షణ పొందిన నిబద్ధత కలిగిన వీర శునకమని అధికారులు పేర్కొన్నారు. ఉగ్రవాదులను గుర్తించి దాడి చేసి పట్టుకోవడంలో 'జూమ్' నేర్పరి. ప్రస్తుతం చికిత్స పొందుతోన్న ఈ వీర శునకం త్వరగా కోలుకోవాలని ఆర్మీ అధికారులు ట్విట్టర్‌లో 'జూమ్' వీడియోను షేర్ చేశారు.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Adbox