Breaking

29, ఆగస్టు 2022, సోమవారం

ఉత్తర కొరియా గురించి కొన్ని షాకింగ్ చట్టాలు - కిమ్ బాబాయ్ రాజ్యం

ఉత్తర కొరియా - కిమ్ బాబాయ్ రాజ్యం

ఉత్తర కొరియా ఈ దేశంలో ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియదు, అలాగే బయట ప్రపంచం ఎలా ఉంటాదో ఈ దేశంలో ప్రజలకు తెలియదు. 

అన్ని దేశాలలో ప్రజల స్వేచ్చకు అనుకూలంగా చట్టాలు ఉంటాయి. కానీ ప్రజాస్వామ్య దేశం అయిఉన్న ఇంకా రాజరికపు పాలన కొనసాగుతున్న దేశం ఉత్తర కొరియా.

   ప్రపంచంలోనే ఒకప్పుడు హడలెత్తిoచిన హిట్లర్ కు ఏమాత్రం తీసిపోని వెక్తి "కిమ్".
కిమ్ రాజ్యం అయిన ఉత్తర కొరియాలో కొన్ని షాకింగ్ చట్టాలు విధించాడు. ఆ చట్టాలు ఏంటో వివరంగా తెలుసుకుదాo!!Shocking Facts

Fact No1:-

విదేశీ సినిమాలు, పాటలు అనుమతించబడవు , ఒక వేళ ఎవరైనా వాళ్ళ ఫేవరేట్ హీరో సినిమా చూడాలి అనిపించి మన సూపర్ స్టార్ రజినీకాంత్ లేదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దో సినిమా చూసాడా....! అంతే మన కిమ్ బాబాయ్ జైల్లో పెట్టమని ఆదేశిస్తాడు.
  అలాగే 2015 కిమ్ బాబాయ్ కి నచ్చనవి ఆ రాష్ట్రo నిషేధిoచిన పాటల్ని క్యాసెట్ లను,సీడీ లను నాశనం చేయమని ఆదేశించాడు.
 అంతటతోనే ఆగకుండా అమెరికన్ సినిమాలు చూడటం మరియు పోర్న్ వీడియోలును సరఫరా చేయడం ఇలాంటి పనులు చేసినవారికి ఆలోచించకుండా ఏకంగా మరణశిక్ష వేస్తాడు.
 మన దేశంలో లాగా టీవీలో ఆ ఛానల్ రాలేదు, ఈ సీరియల్ లో ఏమి జరుగుతుంది అనే మాటలు అక్కడ ఏమి వినపడవు, ఎందుకంటే ఉత్తర కొరియా లు టీవీలో కేవలం 3 ఛానల్ మాత్రమే ఉంటాయి. అంతేకాకుండా వాటిలో వచ్చే మొత్తం కంన్టెంట్ అంత ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది.



Fact No 2:-

  అంతర్జాతీయ కాల్స్ చేయడం నేరం అవును మీరు విన్నది నిజమే...! ఉత్తర కొరియా ప్రజలు అంతర్జాతీయ కాల్స్ చేయలేరు, ఎందుకంటే ఈ విషియం కిమ్ బాబాయ్ కి పెద్ద నేరంగా పరిగణించపడుతుంది. అయితే ఒక వెక్తి మాత్రం ఇవన్నీ లెక్క చేయకుండా 2007 లో ఒక ఫ్యాక్టరీ యజమాని తన ఫ్యాక్టరీ డెవలప్మెంట్ విషియాలు కోసం ఏకంగా 13 సార్లు అంతర్జాతీయ కాల్స్ మాట్లాడాడు అంట. అంతని ధైర్యానికి మనం మెచ్చుకోవచ్చు కానీ అక్కడ ఉంది కిమ్ బాబాయ్ గా ఏమి అయిఉంటాదో కొంచెం ఊహించవచ్చు.అవును మీరు అనుకున్న విధంగే 1,50,000 మంది ప్రజల సమక్షంలో "ఫైరింగ్ స్క్వాడ్" చేత ఉరితీయించారు.


Fact No 3:-

మన రెండు తెలుగు రాష్టంలలోనే కాకుండా ,దేశంలో ఎక్కడైనా అసెంబ్లీ సమావేశాలలో మనల్ని పరిపాలించే నాయకులు ప్రజల సమస్యలును పక్కన పెట్టి నిద్ర పోవడం మనం చూస్తూనే ఉంటాం.
 కానీ కిమ్ బాబాయ్ సమావేశ సమయంలో నిద్రపోవడం అంటే కత్తి మీద సాము లాంటిది. ఇంతా తెలిసి ఎవరైనా నిద్రపోతే ఆ నాయకుడు కి నమ్మక ద్రోహంగా పరిగనించపడుతుంది. అక్కడితో ఆగకుండా మారణ శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. ఇది అంతా తెలిసి ఎవరైనానిద్రపోతారా అనుకుంటున్నారా...! అలా అనుకుంటే పాపం ఒక్కడు తగిలాడు, ఆయన ఎవరంటే ఆ ఉత్తర కొరియా రక్షణ మంత్రే ఆయన పేరు (HYON YONG-CHOL) "హ్యూన్ యోంగ్ - చోల్" కిమ్ బాబాయ్ సంరక్షణలో నిద్రపోయాడు అని 100 మంది వ్యక్తుల ముందు"Anti Air Craft Fire" విమాన నిరోధక కాల్పుల్లో కాల్చి చంపబడ్డాడు.


Fact No 4:-

ఉత్తర కొరియాలో ఎవరైనా నేరం చేస్తే,ఆ నేరం చేసిన వ్యక్తినే కాకుండా ,వారి పిల్లలను, తండ్రిలు, తాతలను కూడా శిక్షించపడతారు. ఇవన్నీ ఎందుకంటే ఒక వేళ నేరం చేసిన వ్యక్తి పారిపోయిన మిగతా వాళ్ళు ఉంటారు కదా!!!అది కిమ్ బాబాయ్ అంటే.


Fact No 5:-

ప్రభుత్వం ఆమోదించిన జుట్టు కత్తిరింపులు మాత్రమే.
అమ్మాయిలు అయిన అబ్బాయిలు అయిన ప్రభుత్వం ఆమోదించిన 28 హెయిర్ కట్స్ లో ఒకదాన్ని మాత్రమే చేయించుకోవాలి. అందులో అమ్మాయిలు 18 రకాల హెయిర్ కట్స్, అబ్బాయిలు 10 రకాల హెయిర్ కట్స్ సెలెక్ట్ చేసుకోవాలి అని కిమ్ బాబాయ్ 2013 లో ఆర్డర్ వేసాడు. కానీ ఇక్కడ మాత్రం ఏంటి అంటే కిమ్ బాబాయ్ హెయిర్ కట్ మాత్రం అందులో చేర్చలేదు, ఎందుకంటే కిమ్ బాబాయ్ ట్రెండ్ ఫాలో అవడు, ట్రెండ్ సెట్ చేస్తాడు గనుక. ఇప్పటి వరకు కిమ్ హెయిర్ స్టైల్ కాపీ చేయడానికి ధైర్యం చేయలేదు అంటా..! అంతేకాకుండా పెళ్లి కాని అమ్మాయిలు కంటే , పెళ్లి అయిన అమ్మాయిలు హెయిర్ కట్ చిన్నగా చేయించుకోవాలి అంటా...! అది కిమ్ చట్టం అంటే.

Fact No 6:-
సొంత బాస్కెట్ బాల్ నియమాలు:
ఉత్తర కొరయా ప్రబుత్వం బాస్కెట్ బాల్ యొక్క రూల్స్ మార్చి తన సొంత రూల్స్ ప్రవేశపెట్టింది. ఎలా అంటే 3 షాట్ లను మిస్ అయితే , ఒక పాయింట్ తీసివేయబడుతుంది.
చివరి 3 సెకన్ లలో చేసిన షాట్ కు 8 పాయింట్లు ఫీల్డ్ గోల్డ్, 125 సవంత్సరాలుగా అడబడుతున్న గేమ్ పై దేశం యొక్క స్వంత ముద్రను వేసింది. అది కిమ్ లెక్క అంటే.

Fact No 7:-
దేశ రాజధానిలో నివసించడానికి అనుమతి అవసరం, ఉత్తర కొరియా "Pyom Gang" లో అత్యంత విజయవంతమైన ,సంపన్నులు మరియు ప్రభావవంతమైన వ్యక్తులు మాత్రమే నివసించాలి అని ఉత్తర కొరియా అధినేత కిమ్ కోరుకుంటున్నారు. ప్రజలు రాజధానిలో నివసించడానికి"ఎక్స్ప్ ప్రెస్ "అనుమతి కలిగి ఉండాలి.

Fact No 8:-
 ప్రపంచ దేశాలు మొత్తం విద్యార్థుల చదువు కోసం సరైన సదుపాయాలు కల్పిస్తున్నాయి. కానీ నార్త్ కొరియా చదువు కోసం సదుపాయాలు కల్పించకపోగా వాళ్ళ సొంత డెస్క్ లు మరియు కుర్చీలు కోసం ఎమౌంట్ చెల్లించాలి..! అవును మీరు విన్నది నిజమే.....విద్యార్థులు తరగతిలో తమ డెస్క్ లు మరియు కుర్చీలు కోసం తప్పనిసరిగా డబ్బులు చెల్లించాలి. అంతేకాకుండా వాళ్ళు పెట్టిన రూల్స్ ప్రకారం తగిన రుసుము చెల్లించాల్సిందే. అంతేకాకుండా అక్కడ పురుషులు మరియు మహిళలు 17 సవంత్సరాల వయస్సులో సైనిక సేవ కచితంగా అవసరం.

Fact No 9:-
ఉత్తర కొరియాలో బైబిల్ నిషేధించబడింది. దానికి కారణం బైబిల్ నాస్తికదేశం సాంస్కృతికి(westren culture) చిహ్నంగా పరిగాంచాపడుతుంది. ఎందుకంటే బైబిల్ పంపిణీ చేస్తున్న ఒక క్రైస్తవ "స్త్రీ" ని అరెస్ట్ చేసి ఉరితీశారు. అంతేకాకుండా 2014 లో ఉత్తర కొరియా పర్యటనలో ఉన్న అమెరికన్ పౌరుడు "జెఫ్రీ పౌల్" ,"చొంగ్జిన్ సెయిలర్స్"క్లబ్ లోని రెస్టారెంట్ లోని బాత్రూంలో బైబిల్ ను మురిచిపోయినందున అరెస్ట్ చేసి 5 నెలలు పాటు జైల్లో ఉంచబడ్డాడు.ఇక్కడ చర్చిలు విషియానికి వస్తే రాష్ట్రంచే నియంత్రిచబడతాయి.

Fact No 10:-
ఐ ఫోన్(i phone)లు లేదా ల్యాప్ ట్యాప్ ఉండవు. ఔను మీరు విన్నది నిజమే...ఉత్తర కొరియన్లు కోసం పైన చెప్పిన విధంగా బ్రాండ్ లు నుండి ఐ ఫోన్ లు,టీవీ లు లేదా ల్యాప్ ట్యాప్ లు లేవు!North Korea Interesting Facts
      ప్రభుత్వ ఐసోలేషన్ విధానం చాలా దాగి ఉన్నందున ఈ దేశ ప్రజలుకు ఎలక్ట్రానిక్స్ మరియు టెక్నాలజీ గురించి చాలా తక్కువ తెలుసు.

1 కామెంట్‌:

Adbox